బిగ్ న్యూస్ : కాక పుట్టిస్తున్న వైసీపీ ఎంపీ ఢిల్లీ పర్యటన.!

Saturday, June 27th, 2020, 12:28:07 PM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకు ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏకులా మారారు అని చెప్పాలి. పార్టీకు వ్యతిరేఖంగా ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ కానీ వైసీపీ అధిష్టానంకు దిమ్మ తిరిగిపోయేలా ఉందని చెప్పాలి.

దీనితో వైసీపీ నుంచి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడంతో దానికి ఊహించని రెస్పాన్స్ ఆయన ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ఆయన ఢిల్లీకి పర్యటన కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఆయన ఢిల్లీలో ఎవరిని కలిశారు ఎవరితో మాట్లాడారు అన్నది హాట్ టాపిక్ అయ్యింది.

ఆయన ఢిల్లీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారని అంతే కాకుండా 50 నిమిషాల పాటు చర్చించి తన భద్రత అంశంపై కూడా మాట్లాడినట్టు సమాచారం. అంతే కాకుండా ఈరోజు మరింత మంది కీలక బీజేపీ నేతలతో రఘురామ కృష్ణంరాజు భేటీ అవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది.