నారా లోకేష్ పై సెటైర్లు సంధించిన వైసీపీ ఎంపీ – మరీ అంత దారుణమా…?

Monday, May 25th, 2020, 04:13:32 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైసీపీ పార్టీ ఎంపీ, పార్టీ కీలకనేత విజయసాయి రెడ్డి మరొకసారి ప్రతిపక్ష నేత నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఎంపీ విజయసాయి రెడ్డి ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ పై వంగ్యాస్త్రాలతో కూడిన పోస్టులు పెట్టారు. కాగా “బిల్‌గేట్స్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. బిల్‌ క్లింటన్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. టోని బ్లెయిర్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. ఇంతకీ పప్పుని తీసుకొచ్చావా, లేదా’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్టు చేశారు.

అంతేకాకుండా “పప్పూ…తప్పు..! నాన్న మీద అలిగేవా? పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా? పప్పూ… తప్పు తప్పు..! అంటూ” విజయసాయి రెడ్డి మరోక ట్వీట్ లో పోస్టు పెట్టారు. కాగా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వాఖ్యలపై ప్రతిపక్షనేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి…