14 ఏళ్లుగా సీఎం గా ఉండి ఎన్టీఆర్ కి ఎందుకు భారత రత్న ఇప్పించుకొలేక పోయాడు!?

Sunday, July 5th, 2020, 09:25:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి మరోమారు ఘాటు విమర్శలు చేశారు. బీ ఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇప్పించాను అని కోతలు కోస్తున్న చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉండి, ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారం అయిన భారత రత్న ను ఎందుకు ఇప్పించుకోలేక పోయాడు అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రపతులను, ప్రధానులను ఎంపిక చేయడం అబద్ధాలు అయిన అయి ఉండాలి లేదంటే, ఎన్టీఆర్ కి దక్కకుండా చంద్రబాబు అడ్డుకొని అయినా అయి ఉండాలి అని విజయ సాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఇందులో ఏది నిజం బాబూ అంటూ ప్రశ్నించారు.

విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇపుడు ఎన్టీఆర్ కి అవార్డ ఇప్పించే బాధ్యత మనదే అంట సార్ అంటూ వైసీపీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొందరు మాత్రం చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేస్తున్నారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే అవమాన పరిచిన మేధావి అని వ్యాఖ్యానించారు. విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.