చంద్రబాబు ఆ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు – వైసీపీ ఎంపీ

Thursday, February 27th, 2020, 10:48:53 AM IST


తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వైజాగ్ లో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు తీరు ని ఎండగడుతూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు అని వ్యాఖ్యానించారు. తను లేకపోతె ప్రపంచమే లేదనే బ్రాంతి అని ఎద్దేవా చేసారు. అందరూ పనికిమాలిన వారు అనే భావన దీని లక్షణాలు అని విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రేరేపించడం దీని కోవలోకే వస్తాయి అని సంచలన వ్యాఖ్యలు చేసారు.

విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉన్నపుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గానీ, ఎన్టీఆర్ చంద్రబాబు ఫై చేసిన వ్యాఖ్యలని గుర్తు చేస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.