విద్యా వ్యవస్థ కే అవి తలమానికం అవుతాయి – వైసీపీ ఎంపీ

Thursday, June 4th, 2020, 02:38:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం లో పలు అంశాల పై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే నాడు నేడు కార్యక్రమం ను సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండేళ్ల లో రాష్ట్రం లోని ప్రభుత్వ స్కూళ్లు దేశ విద్యా వ్యవస్థ కే తలమానికం అవుతాయి అని వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. నాడు నేడు కార్యక్రమం తో కార్పొరేట్ స్కూల్ లను ఇవి అధిగమిస్తాయి అని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలు పిల్లల్లో ఆత్మ విశ్వాసం నింపాయి అని వ్యాఖ్యానించారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ద్వారా అడ్డంకులను అన్ని అధిగమించి ఈ పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకు వెళ్తారు పేద పిల్లలు అని అన్నారు.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రం లో పెను మార్పులు తీసుకొస్తాయి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. నాడు నేడు కార్యక్రమం తో సీఎం జగన్ పేద ప్రజలకి ఉన్నత చదువు ను అభ్యసించే విధంగా చర్యలు చేపట్టారు.