తండ్రినే ఇరికిస్తున్నావా చిట్టి…నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

Sunday, June 28th, 2020, 11:37:26 AM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై మరోమారు వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కి, అప్పటి ఐటీ మంత్రికి సంబంధం లేదు అని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకి విజయ సాయి రెడ్డి ఘాటుగా బదులు ఇచ్చారు. ఫైబర్ గ్రిడ్ కి, అప్పటి ఐటీ మంత్రికి సంబంధం లేదని చిట్టి నాయుడు స్టేట్మెంట్. ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగింది అన్న విషయాన్ని కక్కేశాడు అని వ్యాఖ్యానించారు.నీకు కాకపోతే మరి అప్పటి సీఎం మీ నాన్నకు ఉందా అని విజయ సాయి రెడ్డి సూటిగా నిలదీశారు. తండ్రినే ఇరికిస్తున్నావా చిట్టి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక అప్పటి ఇవిఎం దొంగ హరి ప్రసాద్ ను ఐటీ అడ్వైసర్ గా ఎవరు పెట్టారో చెప్పు అని వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి నారా లోకేష్ ను నిలదీశారు. అయితే విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఐటీ మంత్రికి, ఫైబర్ గ్రిడ్ కి సంబంధం లేదు అని, ఏదైనా సంబంధం ఉంటే ఆనాడు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిదే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరు మాత్రం విజయ సాయి రెడ్డి వైఖరి పై విమర్శలు చేస్తున్నారు. ఒక దొంగ పక్కొడిని దొంగ అంటుంటే చాలా విచిత్రంగా ఉంటుంది అని వ్యాఖ్యానించారు.