టిక్ టాక్ లేని లోటు తీరుస్తున్నాడంటున్నారు – వైసీపీ ఎంపీ!

Saturday, July 11th, 2020, 12:21:35 AM IST

వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి మరోమారు నారా లోకేష్ పై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. తాను ట్వీట్ చేస్తే వైసీపీ వణికి పోతుందన్నాడు చిట్టి నాయుడు అని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. అయితే జనం మాత్రం టిక్ టాక్ లేని లోటు తీరుస్తున్నాదంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. తిండి ఖర్చుల గురించి ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు అని విజయ సాయి రెడ్డి సెటైర్స్ వేశారు. అంతేకాక ఏం చేసినా చిట్టి నాయుడు స్టైలే వేరు అని ఎద్దేవా చేశారు. అయితే కొల్లు రవీంద్ర ను తాజాగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ, అన్నట్లు కొల్లు ను పరామర్శించావా? మర్చిపోయావా చిట్టి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల కి గానూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు లోకేష్ పై విమర్శలు చేస్తుండగా, మరికొందరు మాత్రం విజయ సాయి రెడ్డి తీరు పై విమర్శలు గుప్పిస్తున్నారు. నువ్వు లోకేష్ కి కౌంటర్ ట్వీట్ వేసావ్ అంటేనే తెలుస్తోంది ఎవరు వణుకుతున్నారో అంటూ సెటైర్స్ వేస్తున్నారు.