టీడీపీ కి గట్టి పంచ్ ఇచ్చిన విజయ సాయి రెడ్డి !

Wednesday, July 1st, 2020, 08:18:09 AM IST

వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి టీడీపీ నేతల తీరును ఎండగడుతూ సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తున్నారు. అయితే మరొకసారి విజయసాయి రెడ్డి టీడీపీ నేతల కి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చారు, దీనికి సై రా పంచ్ అని హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారు.

గతంలో నారా లోకేష్ ఫైబర్ గ్రిడ్ కు మరియు తనకు ఎలాంటి సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు.అలానే ఈ ఎస్ ఐ స్కాం కు తనకు ఎలాంటి సంబంధం లేదు అని అచ్చెన్న తెలిపారు. అయితే ఈ రెండింటిని ఆమె ఫ్రేమ్ లో ఉంచుతూ, నాకు ఉద్రవాదానికి ఎలాంటి సంబంధం లేదు అని బిన్ లాడెన్ ఫోటో పెట్టీ మరి ఎడిట్ చేశారు. అయితే దీనికి సై రా పంచ్ అని వ్యాఖ్యానించారు. విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.

విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అన్ని రాసుకున్నాం వడ్డీతో సహా చెల్లిస్తాం అని నారా లోకేష్ గతంలో చెప్పిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ విమర్శిస్తున్నారు.అయితే స్కాం లతో ఎలాంటి సంబంధం లేదని, ఒక్క అమరావతి ను భ్రమరవతి చేయడం తప్ప అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విజయ సాయి రెడ్డి ను విమర్శిస్తున్నారు.