చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయ సాయి రెడ్డి!

Wednesday, May 27th, 2020, 03:46:23 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతి పక్ష పార్టీల మద్యన రాజకీయ విమర్శలు ఘాటుగా ఉన్నాయి. ఒకరి పై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపదుతున్నారు. అయితే ఈ నేపధ్యంలో ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ గ్యాస్ బడితులను పరామర్శిస్తా అని వాళ్లకు భారీగా ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంటా అని చెప్పినొడు కరకట్ట నుండి కదలడం లేదు అని అన్నారు. ఎమ్మెల్యే ల కాళ్ళు పట్టుకొనే పనిలో పడ్డారు అంటూ వ్యాఖ్యానించారు. అధికారం పోయినా, పార్టీ వదిలి పోవద్దని కోట్ల రూపాయల డబ్బు ఆశ చూపిస్తున్నాడు అంటే ఏ రేంజి లో దోచుకున్నా డో ఉహించొచ్చు అని విమర్శించారు.

అయితే నేడు మహానాడు రాజకీయ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ ద్వారా ఈ సమావేశం ను నిర్వహిస్తున్నారు. అయితే ఈ అంశం పై విజయ సాయి రెడ్డి విమర్శించారు. ఇంకెక్కడి టిడిపి, ప్రజలకు దూరమై ఏడాది అయింది అని అన్నారు. ఎల్లో మీడియా, ఆ పార్టీ వెబ్ సైట్ లలో మాత్రమే తరచూ ఉరుములు వినిపిస్తూ ఉంటాయి అని వ్యాఖ్యానించారు. క్యాడర్ లేదు, ఓటు బ్యాంక్ లేదు, అధికారం ఉంటేనే మాట్లాడతారంట అని ఎద్దేవా చేశారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పై, అనుకూల వ్యవస్థలను ఉసిగొల్పి తే ప్రజాక్షేత్రంలో విజయం సిద్దిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు.అంతేకాక వయసు పై బడింది అని, కరోనా భయంతో నిద్ర కూడా పోవడం లేదంట అని వ్యాఖ్యానించారు. అంతేకాక దగ్గర్లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం వెంటిలేటర్ కూడా సిద్దంగా పెట్టింది అని సమాచారం అని అన్నారు.

వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి చేస్తున్న విమర్శల పై నెటిజన్లు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కి అధికారం లేదు అని, ఇంకెక్కడి టిడిపి అని అంటున్నావు, అయితే రోజూ ఈ ట్విట్టర్ లో ట్వీట్స్ ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు.