టీడీపీ టార్గెట్ గా వైసీపీ పక్కా ప్లాన్ రెడీ…

Saturday, January 25th, 2020, 01:40:57 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రజలు, రైతులందరూ కూడా సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ రాజధానుల ఏర్పాటుపై శాసన సభ, మండలిలో టీడీపీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు టీడీపీ టార్గెట్ గా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కాగా టీడీపీ ప్రవర్తించిన తీరుకు నిరసనగా వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా వైసీపీ యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేయడానికి సిద్దమయింది…

కాగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధి విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జ్ లు బాధ్యత తీసుకోవాలని పలు ఆదేశాలు చేశారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు షెడ్యూల్‌ను విడుదల చేశారు.

షెడ్యూల్ ప్రకారం వైసీపీ ప్రణాళికలు…

25.01.2020 : పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అన్ని విశ్వవిద్యాలయాల వద్ద చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నం.

27.01.2020 : యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీలు, పాద‌యాత్ర‌లు.

28.01.2020 : పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి – వికేంద్రీక‌ర‌ణపై యూనివ‌ర్సిటీల వ‌ద్ద స‌ద‌స్సులు నిర్వ‌హ‌ణ‌.

29.01.2020 : పార్టీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో సంత‌కాల సేక‌ర‌ణ‌.

30.01.2020 : వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో టీడీపీ తీరుపై రాష్ట్రప‌తికి పోస్టుకార్డులు పంపే ఉద్య‌మం.

31.01.2020 : తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మూడు ప్రాంతాల జేఏసీ నాయ‌కుల స‌మావేశం.