జగన్ పరువు తీసేస్తున్న టీడీపీ..జగన్ మళ్ళీ దొరికేసారు.!

Sunday, August 18th, 2019, 01:57:36 PM IST

ఏపీలోని వైసీపీ పార్టీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వైసీపీ ను మరియు జగన్ ను టార్గెట్ చెయ్యకుండా ఒక్క రోజు కూడా లేదనే చెప్పాలి.వైసీపీ మరియు జగన్ విషయంలో ఏ చిన్న అంశం దొరికినా సరే టీడీపీ అధిష్టానం తమకి ప్లస్ చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది.తాజాగా ఒక విషయంలో వైసీపీ అడ్డంగా దొరికేసిన ఒక వీడియోను వీరు పోస్ట్ చేసారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యాక ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పుడు వీటికే బ్యాగులు మరియు స్టిక్కర్లు మార్చేసి జగన్ కిట్లు గా పంపిణి చేస్తూ వైసీపీ ప్రభుత్వం దొరికేసింది.ఇప్పుడు ఈ వీడియోను వీరు తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి జగన్ను “స్టిక్కర్ సీఎం” అంటూ నవ్వుతున్నారు.ఇలా ఇంతకు ముందు కూడా ఒకసారి టీడీపీ హయాంలో పంపిణి చేసిన సైకిల్లకు టీడీపీ స్టిక్కర్లు పైనే వైసీపీ స్టిక్కర్లు అంటించుకొని ఒకసారి దొరికిన సంగతి కూడా తెలిసిందే.దీనితో రెండో సరి వైసీపి వాళ్ళు దొరికేసారని సోషల్ మీడియా తెలుగు తమ్ముళ్లు నవ్వుకుంటున్నారు.