బ్రేకింగ్ న్యూస్ : అజ్ఞాతంలో టీడీపీ కీలక నేత

Tuesday, September 10th, 2019, 12:14:43 PM IST

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరసగా టీడీపీ నేతలను టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది . అది యాదృచ్చికమో లేక కావాలనే వైసీపీ పార్టీ పగపట్టి చేస్తుందో కానీ, ప్రతి జిల్లాలో టీడీపీ సైడ్ గట్టిగా మాట్లాడే నేతలు పోలీసు కేసులు ఎదుర్కొంటు ఇబ్బంది పడుతున్నారు. కోడెల ఫ్యామిలీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే చింతామనేని, యరపతినేని, కూన రవిప్రకాష్,ఒంగోలు లో కరణం బలరాం, విశాఖలో గంటా శ్రీనివాసరావు, గుంటూరులో మాజీ మంత్రి, విజయవాడలో మాజీ జలవనురుల మంత్రి, నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.

ముఖ్యంగా కొందరు నేతలు అయితే వైసీపీ ఇబ్బందులు పడలేక అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. చింతమనేని,యరపతినేని లాంటి వాళ్ళు ఎవరికి కనిపించటం లేదు. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అజ్ఞాతంలో ఉన్నదేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ మీద తనదైన మాటలతో ఎదురుదాడి చేసేవాడు సోమిరెడ్డి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానీ, ప్రభుతాన్ని విమర్శించటంలో సోమిరెడ్డి ఎప్పుడు వెనకడుగు వేయలేదు.

సోమిరెడ్డి ఒక పాయింట్ మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వటానికి అధికారపక్షం ఇబ్బంది పడేలా సోమిరెడ్డి మాటల బాణాలు వదిలేవాడు. దీనితో అతన్ని ఆపటానికి వైసీపీ పాత కేసు విషయాన్నీ తాజాగా తెరమీదకి తీసుకోని వచ్చినట్లు తెలుస్తుంది. వేరే వాళ్ళ భూమిని సోమిరెడ్డి తనది అని చెప్పుకొని అమ్మనుకున్నట్లు, ఇప్పుడు ఆ భూమి ఓనర్లు వచ్చి సోమిరెడ్డి మీద కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పుడు విచారానికి రావటంతో సోమిరెడ్డిని విచారణకి హాజరు కావాలని సమన్లు జారీచేసింది కోర్టు, అయితే విచారణకి సోమిరెడ్డి వెళ్లకుండా తన లాయర్ ని పంపినట్లు తెలుస్తుంది. దీనితో సోమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.