పవన్ పై అతీ గతీ లేని వ్యాఖ్యలు..మనఃసాక్షితో రాజన్న ప్రచారం.!

Wednesday, November 20th, 2019, 11:29:23 AM IST

గత కొంత కాలం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన మరియు ఆ పార్టీ పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు సమన్వయం కోల్పోయి రెచ్చిపోయిన సంగతి అందరికి తెలిసిందే.అలాగే పవన్ పై నిరాధారపూరిత అభాండాలు వెయ్యడం దానికి ఆధారాలు ఉన్నాయా అంటే మనః”సాక్షి” లో ఉన్నాయి అంటూ చేసిన కామెంట్స్ పవన్ విషయంలో వారికి ఉన్న పారదర్శకతను తెలియజేసింది.

అయితే విమర్శలు చెయ్యొచ్చు కానీ మరీ జనం నమ్మలేని విమర్శలు చేస్తేనే ఇప్పుడు నవ్వుకోవాల్సి వస్తుంది.పవన్ పై ఇప్పుడు వైసీపీ నేత రాజన్న చేసిన వ్యాఖ్యలను వారి మాధ్యమాలతో రుద్దాలని ప్రయత్నిస్తున్నారు.కేవలం పవన్ ను ఒక మతానికి ఆపాదించే ప్రయత్నం చెయ్యడమే కాకుండా పవన్ కు ఉన్న పదవీ వ్యామోహం వల్ల రెండు మతాల మధ్య కలహాలు రేపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

పవన్ మతాలకు ఎంత గౌరవిస్తారో ఆయన పార్టీలో ఒకే చోట పెట్టిన “భగవద్గీత,బైబిల్ మరియు ఖురాన్”లను చూస్తే తెలుస్తుంది.ఎంతో మంది రాజకీయ విశ్లేషకులే పవన్ రాజకీయాలను మెచ్చుకున్నారు.పదవీ వ్యామోహం ఉన్నవాడే అయితే డబ్బులు మందు పోసి తాను అయిన టీడీపీ,వైసీపీ లకు ధీటుగా కోటాను కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఉండేవాడు కదా..ఇలాంటి వ్యాఖ్యలను తీసుకొచ్చి మనఃసాక్షితో ప్రచారం చేస్తున్నారు.మరి వీరికి నిజంగానే మనఃసాక్షి ఉందో లేదో ఆలోచించుకోవాలి.