రాపాక వర ప్రసాద్ పై వైసీపీ వాళ్లకి ఇంత నమ్మకం ఎందుకో?

Friday, June 14th, 2019, 04:42:32 PM IST

మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి ఊహించని షాకిచ్చే విధంగా కేవలం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే దక్కింది.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.అయితే రాజోలు నుంచి మాత్రమే రాపాక వరప్రసాద్ రూపంలో ఒక్క సీటు జనసేన సొంతం చేసుకుంది.ఇప్పుడు ఈ ఒక్క సీటు అయినా జనసేనలో పూర్తిగా నిలబడుతుందా అంటే దానికి జనసేన శ్రేణులు అవునని అంటే వైసీపీ శ్రేణులు అతను కూడా మా పార్టీలోకి వచ్చి చేరుతారు అని అంటున్నారు.

కానీ రాపాక మాత్రం మొదటి నుంచి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని జనసేన లోనే ఉంటానని ఇప్పటికీ చెప్తూనే వస్తున్నారు.కానీ సోషల్ మీడియాలో మాత్రం జనసేన ఆ ఒక్క స్థానం కూడా మాదే అని అతి త్వరలోనే రాపాక వర ప్రసాద్ కూడా తమ పార్టీలో చేరడం ఖాయమని చాలా నమ్మకంగా చెప్తున్నారు.ఇప్పటికే రాపాక అసెంబ్లీలో తన ప్రసంగం ద్వారా జనసేన శ్రేణుల్లో కొత్త ఆనందాన్ని నెలకొల్పారు.కానీ ఆ ఆనందం మీకు ఎంతో కాలం మిగలదు అన్నట్టుగా చాలా మందే సోషల్ మీడియా ప్రజానీకం జనసేన ఒక్క సీటు కూడా వైసీపీకే చేరుతుందని అంటున్నారు.మరి వీరు అంతలా చెపుతున్నారంటే వారికి ఏ నమ్మకం ఉందో తెలియాలి.