హాట్ టాపిక్: “పెయిడ్ ఆర్టిస్టు”లంటూ మరోసారి రచ్చ షురూ చేసిన వైసీపీ, టీడీపీ

Tuesday, November 12th, 2019, 03:32:47 PM IST

మరొకసారి వైసీపీ, టీడీపీ రచ్చ షురూ చేసింది. అధికార పార్టీ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నుద్దేశించి పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాకుండా ప్రతి పక్ష పార్టీ నాయకుడివి అయి ఉండి హుందా గా ప్రవర్తించాల్సింది పోయి, అసూయా, అహంకారాలతో పాతాళానికి చేరుకున్నావ్ అంటూ చంద్రబాబు నుద్దేశించి వ్యాఖ్యలు చేసారు. అపోజిషన్ లీడర్ గా రాణించాల్సింది పోయి కుప్పం ఎమ్మెల్యే గా మిగిలిపోయావ్ అని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులని రంగం లోకి దింపి చేతకాని తనాన్ని బయటపెట్టుకున్నావ్ అంటూ ఆరోపించారు.

విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ప్రతి పక్ష నేతగా నిర్ణయాత్మక పాత్ర అంటే ఏంటి విజయసాయిరెడ్డి గారు? ట్రైన్లు తగలబెట్టడం, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పంటలు తగలబెట్టడం, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడమా? అధికారం లో వున్న ముఖ్యమంత్రిని కాల్చేయండి, నరికేయండి అని చొక్కా చించుకోవడమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు కడుపు మాన్తా తో తమ బాధల్ని చెప్పుకుంటుంటే పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానపరుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాకుండా పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టింది మీ వైయస్ జగన్ అంటూ టీడీపీ నేత పలు ఆరోపణలు చేసారు. ఈ నెల 14 న చంద్రబాబు దీక్ష చేయనున్నాడు, ఆ నేపథ్యం లో ఇలా పక్కదారి పెట్టె చర్యలు వైసీపీ నేతలు చేస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.