“ఇంటర్ పాసవ్వని పవన్ కళ్యాణ్”..ఇంత కన్నా దౌర్భాగ్యం ఉందా జగన్ గారు.?

Thursday, November 14th, 2019, 04:11:38 PM IST

ఇప్పుడు మాత్రం ముమ్మాటికీ ఏపీ రాజకీయాలు పవన్ వర్సెస్ వైసీపీగా మారిపోయాయి అని చెప్పాలి.ఎలా అయినా సరే పవన్ ను అడ్డుకొనేందుకు జగన్ అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు అనే కన్నా తన స్థాయిని తగ్గించుకుంటున్నారని చెప్పక తప్పడం లేదు.ఎందుకంటే తాజాగా వీరు తీసుకున్న సంచలనాత్మక ఇంగ్లీష్ మీడియం అనే అంశం పెద్ద దుమారం రేపింది.దీనితో జనసేన పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెయ్యగా..

దానికి జగన్ సహా వైసీపీ సరైన సమాధానం చెప్పకుండా ఎప్పటిలానే పవన్ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లి మరింత సంచలనం రేపారు.దీనితో ఒక్క సీటు వచ్చిన జనసేన పార్టీయే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తుంది.వీరే అలా చేసుకున్నారు.తాను ఇంటర్ కూడా పాసవ్వలేదని పవనే పలుమార్లు ప్రస్తావించుకున్నారు.ఒక బడికెళ్లే 7 లేదా ఎనిమిదో తరగతి చదివే బాలికతో ఇంటర్ కూడా పాసవ్వని పవన్ కళ్యాణ్ మీరెవరు మాకు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పడానికి అని అనింది.దీనికి జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.

ఈరోజు ఒంగోల్లో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో ఓ చిన్నారి పలికినో లేక పలికించినవో కానీ ఆమె పలికిన పలుకులు ఇవి.అసలు తెలుగు చదవడం రాని లోకేష్ ఇంటర్ కూడా పాసవ్వని పవన్ కళ్యాణ్ లు ఎవరు మాకు ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పడానికి అంటూ అన్న మాటలు ఇప్పుడు అభ్యంతరకరంగా మారాయి.నిజంగానే ఆ చిన్నారి అవగాహనతోనే అందా? లేక అక్కడ ఎవరి ప్రోత్సాహకం మూలాన అందా?అసలు పవన్ కానీ లోకేష్ కానీ ఏమన్నారో వారు చూసారా?

నేటి రాజకీయాలను వారు పట్టించుకొనే పరిస్థితుల్లో ఉన్నారా అన్న అనుమానాలు ఇపుడు వస్తున్నాయి.పవన్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మాధ్యమం వద్దని కానీ దానికి వ్యతిరేఖం అని కానీ చెప్పలేదు.తెలుగు మాధ్యమాన్ని తీసేసి కన్న తల్లిలాంటి తెలుగు మాధ్యమం తీసేస్తే ఎలా దానికి వ్యతిరేఖం అన్నారు.కానీ వీరేమో చిన్న పిల్లల చేత పవన్ ను అవమాన పరిచేసాం అనుకుంటే అది శత్రువు లేకుండా యుద్ధం చేసినట్టే అవుతుందని చెప్పాలి.మరి వైసీపీ నేతలు ఎందుకు ఇలా చేస్తున్నారో వారికన్నా ఒక క్లారిటీ ఉందో లేదో వారికే తెలియాలి.