రివ్యూ రాజా తీన్‌మార్ : ‘ఏ మంత్రం వేసావె’ – విడుదలకాకపోయున్నా బాగుండేది !

Friday, March 9th, 2018, 06:00:28 PM IST

తెరపై కనిపించిన వారు: విజయ్ దేవరకొండ,శివానీ సింగ్

కెప్టెన్ ఆఫ్ ‘ఏ మంత్రం వేసావె’: శ్రీధర్ మర్రి

మూల కథ :

నిక్కీ (విజయ్ దేవరకొండ) ఇంట్లోంచి బయటి వెళ్లకుండా ఎప్పుడూ వీడియో గేమ్స్, సోషల్ మీడియా అంటూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను కూడ బాధపెడుతుంటాడు. అలాంటి అతను సోషల్ మీడియా ద్వారా రాగమాలిక (శివానీ సింగ్) అనే అమ్మాయిని ఇష్టపడి ఆమెకు దగ్గరవ్వాలనుకుంటాడు.

కానీ రాగమాలిక మాత్రం నిఖిల్ మెంటాలిటీని అంచనా వేసి తనని కలవాలంటే ఒక గేమ్ ఆడాలని అతనికి ఛాలెంజ్ విసురుతుంది. ఆ గేమ్ ఏంటి, నిక్కీ దాన్ని ఎలా ఆడాడు, చివరికి ఆమెను ఎలా చేరుకున్నాడా లేదా, అసలు రాగమాలిక, నిక్కీకు అలాంటి ఛాలెంజ్ ఎందుకు విసిరింది అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :
–> హీరో విజయ్ దేవరకొండ జీవితం అంటే భాధ్యతలేని, సమాజం అంటే సదాభిప్రాయం లేని యువకుడిగా బాగానే నటించాడు.  కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.

–> దర్శకుడు శ్రీధర్ మర్రి సమాజంలో ఎక్కువైపోయిన సోషల్ మీడియా నేరాలని, టెక్నాలజీ ద్వారా యువత నిర్వీర్యమైపోతున్న విధానాన్ని సినిమా ద్వారా చూపాలనుకోవడం బాగుంది.
–> హీరోయిన్ హీరోను మార్చడానికి అతనికి లైఫ్ గేమ్ పెట్టడం, దాన్ని ద్వారా అతను జీవితం, ప్రేమ విలువల్ని తెలుసుకోవడం అనే అంశం ప్రేక్షకులకి కొద్దిగా నచ్చుతుంది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా చెప్పిన విధానం సరిగా లేదు.  ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథనం సినిమాలో మచ్చుకు కూడ కనబడదు.
–> ‘అర్జున్ రెడ్డి’ లో విజయ్ నటనను చూసి ఈ చిత్రాన్ని చూడటం కష్టాంగానే అనిపిస్తుంది.
–> స్క్రీన్ ప్లే లేకపోయినా కనీసం సన్నివేశాలని చిత్రీకరించే తీరైన బాగుంటే ప్రేక్షకులు కొద్దో గొప్పో ఊరట చెందుతారు.  కానీ ఇందులో మాత్రం తక్కువ స్థాయి నిర్మాణ విలువలు, ఒక క్వాలిటీ సినిమాకి ఉండాల్సిన సాంకేతికత లేకపోవడం నిరుత్సాహపరుస్తాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఈ చిత్రంలో నిరుత్సాహం తప్ప అంతగా ఆశ్చర్యానికి గురిచేసే సన్నివేశాలేవీ లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఏంట్రా బాబు.. సినిమా అలా ఉంది. 
మిస్టర్ బి : ఏదో దేవరకొండ మొదటి సినిమా అని పొతే భలే షాక్ ఇచ్చారు. 
మిస్టర్ ఏ : నాకైతే ఇతను అర్జున్ రెడ్డిలోని విజయేనా అనిపించింది. 
మిస్టర్ బి : ఈ సినిమా అసలు విడుదలకాకపోయున్నా బాగుండేది.  

  •  
  •  
  •  
  •  

Comments