`ఏమాయ చేశావే` సీక్వెల్ స్టోరి షాకింగ్‌!

Wednesday, June 6th, 2018, 11:36:38 AM IST


గౌత‌మ్ మీన‌న్ విజ‌న్ నుంచి పుట్టుకొచ్చిన సినిమా `ఏమాయ చేశావే`. ద‌ర్శ‌కుడు కావాల‌నుకున్న ఓ కుర్రాడు ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుందో అందంగా చూపించారాయ‌న‌. నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టించిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం వెన‌క గౌత‌మ్ సెన్సిబిలిటీస్ బ‌లంగా ప‌ని చేశాయ‌ని చెప్పొచ్చు. ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను అంత‌కుమించి అందంగా ఫ్రేములు క‌ట్టిన మేధావి అత‌డు. అందుకే అత‌డు ఈ సినిమాకి సీక్వెల్ తీస్తాను అని ప్ర‌క‌టించ‌గానే అంతా అటే చూశారు. గ‌త కొంతకాలంగా ఏమాయ చేశావే సీక్వెల్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే దానిని అధికారికంగా మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే ఇక ఈ సినిమా ప‌ట్టాలెక్కేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు. గౌత‌మ్ మీన‌న్ ప్ర‌స్తుతం ఈ సినిమా క‌థ‌ను రెడీ చేస్తున్నారు. తొలి భాగంలో జెస్సీతో కార్తీక్ ల‌వ్ డిస్ట్ర‌బ్ అవుతుంది. అలా ప్రేమ చెడాక కార్తీక్ .. ఒక ఫ్రెండు పెళ్లికి వెళ‌తాడు. అక్క‌డ నుంచి ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఆ క్ర‌మంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల స‌మాహార‌మే `ఏమాయ చేశావే 2`. ఇంట్రెస్టింగ్‌గా ఈసారి రోడ్ ట్రిప్ క‌థాంశంతో ఈ సీక్వెల్ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. ఆస‌క్తిక‌రంగా ఆ సినిమాతో మొద‌లైన చై-సామ్‌ ల‌వ్ చివ‌రికి పెళ్లితో సుఖాంత‌మైంది. కానీ సీక్వెల్‌లో గౌత‌మ్ మీన‌న్ ఎలా చూపిస్తారో అన్న క్యూరియాసిటీ నెల‌కొంది. 2010లో ఏమాయ చేశావే రిలీజైంది. స‌రిగ్గా 8 ఏళ్ల‌కు సీక్వెల్ స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు గౌత‌మ్ మీన‌న్. చైతూ ప్ర‌స్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అటుపై గౌత‌మ్‌తో క‌లిసి సెట్స్‌కెళ్లే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే దీనిపై ద‌ర్శ‌క‌హీరోల్లో ఎవ‌రో ఒక‌రు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments