`ప‌చ్చ‌ మీడియా` నాట‌కాలకు ఎండ్ కార్డ్ ఎపుడు?

Thursday, July 11th, 2019, 01:10:50 PM IST

ఏపీ రాజ‌కీయాల్లో ఓ వ‌ర్గం మీడియా చేసిన హ‌డావిడీ అంతా ఇంతా కాదు. టీడీపీ ఓట‌మి పాల‌వుతుంద‌ని జాతీయ మీడియా కోడై కూస్తే ఆ పార్టీకి బాకా వూదుతున్న ఎల్లో మీడియా మాత్రం 150కి పైమాటే అంటూ టీడీపీ అధినేత‌ను త‌ప్పుదారి ప‌ట్టించింది. త‌ద్వారా ఏపీ ఓట‌ర్ల‌ని కూడా ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసింది. గ‌త ద‌శాబ్దాల కాలంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప‌లు మీడియా సంస్థ‌లు ఎక్కువ శాతం ఒకే సామాజిక వ‌ర్గం చేతిలో బందీ అయిపోయాయి. దాంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట‌. త‌మ సామాజిక వ‌ర్గం వారు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతుంటే వారికి వంత‌పాడ‌టం మీడియా సంస్థ‌ల వంతైంది.

నాయ‌కుల కోసం , త‌మ వ‌ర్గాన్ని రాజ‌కీయాల్లో కాపాడు కోవ‌డం కోసం మీడియా సంస్థ‌ల్లో దాదాపు అత్య‌ధికం ఎల్లో మీడియాలుగా మారిపోయాయి. వాస్త‌వాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు క‌ప్పిపుచ్చుతూ అంతా ఓకే అన్న ధోర‌ణికి అల‌వాటు ప‌డిపోయి జ‌నాల‌ని కూడా త‌మ త‌ప్పుడు క‌థ‌నాల‌తో మోసం చేయ‌డం మొద‌లుపెట్టాయి. త‌ద్వారా భారీగా ముడుపులు ద‌క్కించుకుని మ‌రింత‌గా దిగ‌జారుతున్నాయి. అయితే ఈ మీడియాకు వ‌త్తాసు ప‌లుకుతున్న కీల‌క పార్టీని ఏపీ ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించినా స‌ద‌రు మీడియా వ‌ర్గాల్లో మార్పులేవీ క‌నిపించ‌డం లేదు. గ‌తంలో త‌మ‌కు అత్యంత స‌న్నిహిత‌మైన పార్టీకి చెందిన నేత‌ల ఇళ్ల‌పై ఐటి రైడ్‌లు జ‌రిగిగే ఏదో జ‌రిగిపోతోంది. మోదీ క‌క్ష గ‌ట్టార‌ని ప్ర‌చారం కొత్త త‌ర‌హా వార్త‌ల్ని వండి వార్చారు. అయితే ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వానికి అత్యంత స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తి సంస్థ‌ల‌పై అదే ఐటీ దాడులు జ‌రిగితే సోస‌ల్ మీడియాను అడ్డుపెట్టుకుని వ్య‌తిరేక వార్త‌ల్ని రెడీమేడ్‌గా సిద్ధం చేసి వ‌దిలారు. ప్ర‌జ‌లు ఛీకొట్టినా ఎల్లో మీడియాకు ఇంకా క‌నువిప్పు కాలేద‌ని ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా జ‌ర్న‌లిజం విలువ‌ల్ని దిగ‌జాక్చ‌కుండా విలువ‌ల కోసం, స‌మాజ శ్రేయ‌స్సు కోసం ఆయా మీడియా సంస్థ‌లు ప‌నిచేస్తే మంచిద‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు సూచిస్తున్నారు. వింటారా?