కేసీఆర్‌, జ‌గ‌న్ బంధంపై ఎల్లో మీడియా ప్ర‌చారం!

Sunday, June 2nd, 2019, 08:55:17 AM IST

నేటి వ్య‌వ‌స్థ‌లో కొంత మంది మీడియా అధిప‌తులు రాజ్యాంగేత‌ర శ‌క్తులుగా మారుతున్నారు. ఎన్టీఆర్ తో స‌న్నిహితంగా వుండే ఓ మీడియా అధినేత చిన్న ఈగో క్లాష్ కార‌ణంగా త‌న పంత‌మే నెగ్గాల‌ని చివ‌రికి ఎన్టీఆర్ రాజ‌కీయ, వ్య‌క్తిగా జీవితం ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యారు. ఆయ‌న ఎవ‌రో ఇప్ప‌టికే అర్థ‌మై వుంటుంది. ఈనాడూ గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు. ఇక చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక క్యాస్ట్ కార్డ్‌తో ద‌గ్గ‌రై ప్ర‌భుత్వాన్నే శాసిస్తూ సహాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి అధినేత రాధాకృష్ణ‌.

ఈ ఇద్ద‌రు ఇప్పుడు కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్‌ల బంధాన్ని చూసి ఓర్వ‌లేక‌పోతున్నారా?. ఎలాగైనా ఈ బంధాన్ని విడ‌గొట్టాల‌నుకుంటున్నారా? అంటే సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం చూస్తే నిజ‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. వైఎస్ జ‌గ‌న్ గెలుపు వెనుక ప‌రోక్షంగా కేసీఆర్ హ‌స్తం వుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందుకు కృత‌జ్ఞ‌త‌లుగా జ‌గ‌న్ గెలిచిన వెంట‌నే హైద‌రాబాద్ వ‌చ్చి గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసి త‌రువాత కేసీఆర్‌ని స‌తీస‌మేతంగా క‌లిసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్‌ను కేసీఆర్ ఆలింగ‌నం చేసుకున్న తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌లైంది. వైఎస్ తెలంగాణ ఉద్య‌మాన్ని ఆ స‌మ‌యంలో అణ‌చివేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం కేసీఆర్ ఓ మాట‌న్నారు.

`తెలంగాణ ఉద్య‌మాన్ని అణ‌చివేయాని వైఎస్ చూశాడు. అలాంటి వైఎస్ పావురాల గుట్టలో పావుర‌మైపోయాడు` అని సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం కొంత మంది సూచ‌న మేర‌కు వైర‌ల్ చేస్తున్నారు. ఇది జ‌గ‌న్ కంట‌ప‌డి మ‌న‌సు చివుక్కుమ‌న‌క మాన‌దు. ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెర‌గ‌క మాన‌దు అనేది ఆ వ‌ర్గం దురాలోచ‌న‌. అయితే ఇవన్నీ ప‌ట్టించుకునే స్థాయిలో జ‌గ‌న్ మైండ్ సెట్ లేద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.