చంద్ర‌బాబు భూదందాపై ప‌చ్చ ప‌త్రిక ఎడిటోరియ‌ల్‌!!

Sunday, June 2nd, 2019, 09:42:41 PM IST

ఇది వింత‌ల్లోకెళ్లా వింత‌. పసుపు ప‌చ్చ‌గా క‌ళ్లు భైర్లు క‌మ్మేసే వింత‌. నిజ్జంగా నిజం. ఇది న‌మ్మండి. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ఓ ప‌చ్చ ప‌త్రిక ఎడిటోరియ‌ల్ బిగ్ షాక్ ఇస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే .. చంద్ర‌బాబును మోదీ టార్గెట్ చేస్తున్నారు! అని చెప్ప‌బోయి అస‌లు రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు భూముల్ని కొట్టేసిన వైనాన్ని స‌ద‌రు ప‌చ్చ‌ప‌త్రిక ఎడిటోరియ‌ల్ బ‌య‌ట‌పెట్టింది. `గుమ్మ‌డికాయ దొంగ‌` త‌ర‌హాలో చంద్ర‌బాబు దొంగ‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టేసింది స‌ద‌రు ప‌త్రిక‌. అది కూడా అత్యంత కీల‌క‌మైన ఎడిటోరియల్ కావ‌డంతో ప్ర‌స్తుతం దీనిపై ఏపీ వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ స‌ద‌రు ప‌చ్చ ప‌త్రిక అధినేత ఆర్కే ఏం రాశారంటే..

“ప్రస్తుత విపత్కర పరిస్థితులలో పార్టీని కాపాడుకోవడం చంద్రబాబుకు కూడా కత్తి మీద సామే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి- పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌- దిల్లీలో ప్రధానమంత్రి మోదీ త్ర‌యం బాబుకు ప్ర‌ధాన శత్రువులు. ఇంతమంది శత్రువులను తట్టుకుని నిలబడటం చంద్రబాబుకు శక్తికి మించిన పనే. ఈ గడ్డు పరిస్థితిని అధిగమించాలంటే కేంద్ర పెద్దల ముందు బాబు త‌లొంచాలి. పార్టీని కాపాడుకోవడానికి ఆయన ముందున్న కర్తవ్యం ఇదొక్కటే. అయితే చంద్రబాబు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు ద‌రికి రానిస్తారా? ఎందుకంటే వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేసే వాళ్లు తోలు తీయ‌డం ఖాయం“ అంటూ రాసుకొచ్చారు ఎడిటోరియ‌ల్ లో. అంతేకాదు భాజ‌పా తెలుగు రాష్ట్రాల‌పై పెద్ద స్కెచ్ వేసింద‌ని .. ఏపీలో చంద్ర‌బాబును.. తెలంగాణ‌లో కేసీఆర్ ని బ‌త‌క‌నివ్వ‌ద‌ని స‌ద‌రు ప‌త్రిక రాసుకురావ‌డం సంచ‌ల‌న‌మైంది.

కేంద్రంలోని భాజ‌పా తేదేపాని- చంద్ర‌బాబుని టార్గెట్ చేసింది. దీంతో బాబు లోగుట్టు మొత్తం బ‌య‌ట‌కి త‌వ్వే ప‌నిలో ఉన్నారంతా. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అక్రమాలు ఏమైనా జరిగాయా? అన్నది తేల్చుకోవడానికై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే అడుగులు వేయ‌డం వెన‌క కేంద్రం సాయం ఉంది. చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాంట్రాక్టులపైన దృష్టి సారించడంతోపాటు రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై విచారణ జరిపించడం ద్వారా చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రూవ్ చేయ‌బోతున్నారు!! అంటూ స‌ద‌రు ఎడిటోరియ‌ల్ లో గుమ్మ‌డికాయ‌ల దొంగ‌లా భుజాలు త‌డిమేసుకోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అంటే త‌న‌కు తెలియ‌కుండానే ఆర్కే అలియాస్ రాధాకృష్ణ త‌న ప‌చ్చ ప‌త్రిక‌లో చంద్ర‌బాబు లోగుట్టు మొత్తం బ‌య‌ట పెట్టేశార‌న్న‌మాట‌!!! అంటే రాజ‌ధానిలో చంద్ర‌బాబు & కో ఎన్ని ఎక‌రాల భూమి కొట్టేశారో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సి ఉంది మ‌రి!