తన పెళ్లి వార్త నిజమే అంటున్న హీరోయిన్ !

Sunday, June 3rd, 2018, 03:37:47 PM IST

బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన కొందరు హీరోయిన్ లు ఇటీవల తమ పెళ్లి వార్తలతో షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, నటి శ్రియ శరన్ వంటి భామలు తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటువంటి వారి వరుసలో కొత్తబంగారులోకం ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ కూడా చేరుతున్నారు. రైడ్, కాస్కో, కళావర్ కింగ్ తదితర చిత్రాల్లో నటించిన ఆమె కొంత కాలం క్రితం తన జీవితానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కున్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఆ తరువాత ఆమె తెలుగు సినిమాలు బాగా తగ్గించి అక్కడక్కడా కొన్ని హిందీ సీరియల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమెకు ఒక బాలీవుడ్ దర్శకుడితో పెళ్లి జరగబోతోందని ఆమె సన్నిహితులు కొందరు చెప్పినట్లు పుకార్లు వచ్చాయి. అయితే వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ నేడు శ్వేత అసలు విషయాన్నీ మీడియా కి వివరించారు. అవును నిజమే, నేటి సమాజంలో మగవారు ఆడవారి ముందుకు పెళ్లి ప్రపోజల్ తేవడం కాదు,

ఆడవారే మగవారికి పెళ్లి విషయం ప్రపోజ్ చేయవలసి వస్తోందని అన్నారు. నిజానికి తనకు కాబోయే భర్త, బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ కు తన ప్రేమ విషయం కొద్దిరోజుల క్రితం గోవా టూర్ వెళ్లి నపుడు చెప్పానన్నారు. ఆ తర్వాత అతను కూడా తనకు అంగీకారం తెలపడంతో తమ ప్రేమ విషయం ఇద్దరి వైపు పెద్దలకు చెప్పడంతో వారు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారని ఆమె చెప్పింది. ఇటీవల వారిద్దరికీ నిశ్చితార్ధం జరిగిందని, అయితే పెళ్లి మాత్రం ఇప్పటికిప్పుడు కాకుండా కొంత సమయం ఆగి చేసుకుందామని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇకపోతే తమ జీవిత విషయాలను బయటకు చెప్పుకోదల్చుకోలేదని ఆమె వెల్లడించారు. కాగా ప్రస్తుతం శ్వేతా బాలీవుడ్ లో ఒక చిత్రం చేస్తుండగా, తెలుగులో గ్యాంగ్ స్టార్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు……