నా హీరో, నా గురువు, నా బలం మీరే నాన్న : మహేష్ బాబు

Thursday, May 31st, 2018, 06:10:47 PM IST

ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారి 76వ జన్మదినం నేడు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని నూతన పోకడలతో, కొత్త పుంతలు తొక్కించిన ఘనత కేవలం లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కుతుందనంలో ఏమాత్రం సందేహం లేదు. తొలి 70ఎమ్ఎమ్, తొలి స్కోప్, తొలి కౌబాయ్, తొలి జేమ్స్ బాండ్ ఇలా పలురకాల చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కృష్ణ గారు ఇప్పటివరకు దాదాపు 350 చిత్రాల్లో నటించారు. ఒక హీరో సంవత్సరంలో 18 సినిమాలు, అలానే ఒక రోజులో దాదాపు 20 గంటలు పనిచేయడం కేవలం కృష్ణ గారికే సాధ్యం అని దివంగత దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు ఒకానొక సందర్భంలో చెప్పారు. అంతే కాదు కృష్ణ గారు ఎంత అందంగా వుంటారో ఆయన మనసు అంతకు వండింతలు అందమైనదని ఎందరో ఇండస్ట్రీ వ్యక్తులు చెప్పడం వింటుంటాం.

కాగా నేడు 75 ఏళ్ళు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగిడుతున్న అయన పుట్టినరోజును అభిమానులు ప్రతిసంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎప్పటిలానే ఈ పుట్టిన రోజున తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియ చేసారు నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు. మీరే నా గురువు, మీరే నా రియల్ హీరో, మీరే నా బలం. మీ కొడుకుగా జన్మించినందుకు గర్వపడుతున్నాను. ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అయినా మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు నాన్న అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో స్పెయిన్ లో విహారయాత్రకు వెళ్లిన మహేష్ బాబు, వచ్చేనెల ప్రథమార్ధంలో వంశి పైడిపల్లి దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు, అశ్విని దత్ నిర్మాతలు……