టాప్ డైరెక్ట‌ర్‌తో కుర్ర‌నాయిక ఎఫైర్‌?

Wednesday, July 25th, 2018, 11:21:07 PM IST

హీరో కం డైరెక్ట‌ర్‌గా పాపుల‌రైన మ్యారీడ్ గ‌య్‌తో ప్ర‌స్తుతం ఓ యువ‌క‌థానాయిక సీరియ‌స్‌గా రిలేష‌న్‌షిప్‌లో ఉంద‌ని తెలుస్తోంది. ప‌లువురు క‌థానాయిక‌ల‌తో ఎఫైర్ సాగించిన అత‌గాడు ప్ర‌స్తుతం ఈ యువ‌నాయిక‌ను పెళ్లాడాల‌నుకుంటున్నాడ‌ని, అందుకు స‌ద‌రు అందాల క‌థానాయిక ఓకే చెప్పింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పిల్ల‌లు ఉన్న స‌ద‌రు హీరో కం డైరెక్ట‌ర్ ఈ యంగ్ బ్యూటీతో రిలేష‌న్‌షిప్ సాగించ‌డం యువ‌నాయిక‌ మ‌మ్మీకి అస్స‌లు న‌చ్చ‌డం లేదుట‌. ఈ బంధం కేవ‌లం ప్రొఫెష‌న‌ల్‌గా మాత్ర‌మే ఉండాలి. అంత‌కుమించి ఇంకేమీ కుద‌ర‌ద‌ని ఖ‌రాకండిగా త‌నకు చెప్పేసిందిట‌. స‌ద‌రు హీరో కం డైరెక్టర్ ఇండ‌స్ట్రీలో ఓ టాప్ హీరోయిన్‌ని పెళ్లాడాల‌ని చివ‌రి నిమిషంలో వెన‌క్కి త‌గ్గిన సంగ‌తిని ప్ర‌స్థావిస్తున్నారు. మొత్తానికి యువ‌క‌థానాయిక‌తో కొత్త ఎపిసోడ్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లింత‌కీ ఎవ‌రీ న‌టుడు కం డైరెక్ట‌ర్‌? ఇంత‌కీ ఆ యువ‌క‌థానాయిక ఎవ‌రై ఉంటారు? అంటారా? ప‌్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. ఇక ఆ యువ‌నాయిక ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ్‌, హిందీలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.

  •  
  •  
  •  
  •  

Comments