కరోనా పరీక్ష చేయండంటూ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి హంగామా..!

Wednesday, June 24th, 2020, 01:31:10 AM IST


తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఓ యువకుడు తనకు కరోనా పరీక్ష చేయాలంటూ హల్‌చల్ సృష్టించాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీకి చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉండి వచ్చిందనే సమాచారంతో అధికారులు ఆమెకు కరోనా పరీక్ష చేశారు.

అయితే ఆ పరీక్షలలో ఆమెకు పాజిటివ్ అని తేలడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే తన తల్లికి కరోనా సోకడంతో తనకు కూడా కరోనా సోకి ఉండవచ్చన్న అనుమానంతో తనకు కూడా కరోనా పరీక్ష చేయాలని కోరుతూ బాన్సువాడ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి హల్‌చల్ చేశాడు. దీంతో పోలీసులు కూడా‌ ఆ యువకుడిని కరోనా పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.