సీక్రెట్ ల‌వ‌ర్‌ కోసం దుబాయ్ జంపైన హీరో!!

Wednesday, October 25th, 2017, 05:56:30 PM IST

గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ మీడియాలో ముదురు ఐటెమ్ భామ మ‌లైకా అరోరాఖాన్‌- కుర్ర హీరో అర్జున్ క‌పూర్ ల‌వ్వాయ‌ణం గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆల్రెడీ పెళ్ల‌యిన ఆంటీతో కుర్ర హీరో రొమాన్స్ అంటూ ఒక‌టే ఊద‌ర‌గొట్టుడు ప్ర‌చారం సాగింది. చెట్టు, పుట్ట‌, క్ల‌బ్బు, ప‌బ్బు అంటూ జోరుగా ఈ జంట షికార్లు చేస్తుండ‌డంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు ప్ర‌చార‌మ‌య్యాయి. స‌ల్మాన్ సోద‌రుడు ఆర్భాజ్ ఖాన్‌ని వివాహ‌మాడిన మ‌లైకాకి ఇదేం పోయేకాలం? అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సిటీ ఔట్‌స్క‌ర్ట్స్‌లోని స్టార్ హోట‌ళ్ల‌లో డిన్న‌ర్ డేట్‌కి వెళ్లి మీడియాకి చిక్కింది ఈ జంట‌.

అయితే నిన్న‌టిరోజున ఈ హాట్ క‌పుల్ విడిపోయారంటూ భ‌ళ్లున పేలే వార్త ఒక‌టి వ‌చ్చింది. ఆ ఇద్ద‌రిమ‌ధ్యా ఎఫైర్ ముగిసింది. ఎవ‌రి దారి వాళ్లు చూసుకున్నారంటూ మ‌రోసారి మీడియా ఊద‌ర‌గొట్టేసింది. అలా ఊద‌ర‌గొట్టిన 24 గంట‌లైనా కాక‌ముందే.. మ‌రో షాకిచ్చే మ్యాట‌ర్ లీకైంది. రీసెంట్‌గానే మైల‌కా దుబాయ్‌లో 44వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంది. ఈ వేడుక‌ల‌కు కుర్ర హీరో అర్జున్ క‌పూర్ సీక్రెట్‌గా వెళ్లి వ‌చ్చాడని ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్‌సైట్లు ఘోషిస్తున్నాయి. మ‌లైకా త‌న స్నేహితుల‌తో క‌లిసి దుబాయ్ వెళ్లింది. ఇందులో ప‌వ‌న్ `త‌మ్ముడు` ఫేం అతిధి గోవిత్రీకర్ కూడా ఉంది. అయితే దుబాయ్‌కి ఏదో ప‌నిమీద వెళుతున్నా అంటూ అర్జున్ క‌పూర్ మ‌లైకా ఉంటున్న హోట‌ల్లోనే దిగాడుట‌. అంతేకాదు త‌న ప్రేయ‌సి పుట్టిన‌రోజుకు అవ‌స‌ర‌మ‌య్యే ప్ర‌త్యేక‌మైన కేక్‌ని త‌నే కొనిచ్చాడుట‌. అయితే ఆ సెల‌బ్రేష‌న్స్‌కి సంబంధించిన ఫోటోలు ఏవీ లీక్ కాకుండా ఆ జంట జాగ్ర‌త్త‌ప‌డింద‌ని చెబుతున్నారు. అర్జున్ క‌పూర్‌ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కొంద‌రు అభిమానులు సెల్ఫీలు కావాలంటూ వెంబ‌డించారు. అలా మొత్తానికి కుర్ర హీరో సీక్రెట్ ఎఫైర్ మ‌రోసారి క‌న్ఫామ్ చేస్తూ ప్ర‌స్తుతం బాలీవుడ్లో ప్ర‌చార‌మ‌వుతోంది. విడిపోయారంటూ ఓసారి, ఎఫైర్ న‌డుస్తోందంటూ ఇంకోసారి ఈ జంట‌పై వార్త‌లు వెలువ‌డుతున్నాయి. దీనిపై క‌నీసం పెద‌వి విప్పేందుకు కూడా ఆ ఇద్ద‌రూ సిద్ధంగా లేరు మరి.

  •  
  •  
  •  
  •  

Comments