మెగా హీరోలిద్దరికీ ముప్పే..!

Monday, January 29th, 2018, 03:53:11 PM IST

ఇప్పుడు సినీవర్గాల అందరి దృష్టి ఫిబ్రవరి 9 పైనే. ఆ రోజు ఏకంగా నాలుగు మంచి అంచనాలు ఉన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ముగ్గురు యువ హీరోలు పోటీలో నిలువగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు రూపంలో సీనియర్ హీరో బరిలో నిలిచాడు. వీటిలో యువ హీరో నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ చిత్రం ఫిబ్రవరి 9 విడుదలవుతుందా లేదా అనే సందేహాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం ఇంత వరకు ప్రమోషన్ ల వేగం పెంచలేదు.

ఇక మెగా హీరోలు వరుణ్ తేజ్ మరియు సాయిధరమ్ తేజ్ 9 వ తేదీ బెర్తులు ఖాయం చేసుకున్నారు. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ అంటూ రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు. సాయిధరమ్ తేజ్ ‘ఇంటెలిజెంట్’ గా యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. రెండిటిపైనా మంచి అంచనాలు ఉన్నాయ్. ఇక మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన గాయత్రి చిత్రంపై ఇటీవల వరకు పెద్దగా అంచనాలు లేవు. తాజగా విడుదలైన ట్రైలర్ తో ఈ ఒక్కసారిగా గాయత్రి చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. మోహన్ బాబు మరో మారు తన డైలాగులతో మెస్మరైజ్ చేస్తుండడంతో అంతా ఈ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మెగా హీరోలమధ్య పోటీ నెలకొని ఉంది. మోహన్ బాబు కూడా సీన్ లోకి రావడంతో యువ హీరోలకు పోటీ తప్పేలా లేదు.