“అరవింద సమేత”లో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!

Thursday, July 12th, 2018, 12:26:19 AM IST


వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రం అరవింద సమేత. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుండి అటు ప్రేక్షకుల్లో, అటు తారక్ అభిమానుల్లో భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ తో చేసిన తాను తీసిన అజ్ఞాతవాసి భారీ పరాజయం పాలవడంతో త్రివిక్రమ్ ఈ చిత్రం ఎలాగైనా సూపర్ హిట్ అవ్వాలని కసితో, పట్టుదలతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, టాలీవుడ్ పరిశ్రమలో అంతకముందు ఆతరువాత చిత్రంతో రంగప్రవేశం చేసిన ఈషా రెబ్బ ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటిస్తోందట. అంతేకాక ఆమె హీరోకి మాజీ ప్రేయసిగా నటిస్తున్నట్లు చెపుతున్నారు. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది…..

  •  
  •  
  •  
  •  

Comments