అమ్మమ్మ అయిన యంగ్ హీరోయిన్!

Thursday, July 12th, 2018, 12:35:04 AM IST


ఈ వార్త వింటానికి వింతగా మరియు కొత్తగా అనిపించినప్పటికీ, పూర్తిగా జరిగిన విషయం ఏమిటో తెలుసుకుంటే మీకే అర్ధం అవుతుంది. మన హీరోలు మరియు హీరోయిన్లు లో చాల మంది పెంపుడు జంతువులను ఎక్కువగా పెంచుకుంటూ ఉండడం చూస్తున్నాం. అందునా హీరోయిన్లులో కొందరు అయితే మరీ ముఖ్యంగా వాటిని విడిచి పెట్టి ఉండలేక వాటిని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుని, తీరిక వేళల్లో సమయం అంతా వాటితోనే గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంచుకించు ఆ కోవకు చెందిందే హీరోనే లక్ష్మి రాయ్.

ఆమెకు పెట్స్ అంటే అమిత ఇష్టం, అయితే తాను పెంచుకుంటున్న పెంపుకు కుక్కను ఒక బిడ్డ సమానంగా చూసుకునే లక్ష్మి రాయ్ ఇటీవల ఆ కుక్కకు పుట్టిన రెండు బుల్లి కుక్కపిల్లలను ఎత్తుకుని ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, నా వయసులోని వారు అందరూ కూడా హ్యాపీగా అమ్మలు అవుతుంటే, నేను అనుకోకుండా ఈ బుల్లి కుక్కపిల్లలకు అమ్మమని అయ్యాను అంటూ, వాటిని ముద్దాడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. కాగా ప్రస్తుతం లక్ష్మి రాయ్ చేసిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…..

  •  
  •  
  •  
  •  

Comments