నా చావుకు ఆ ఎమ్మెల్యేనే కారణం.. వరంగల్‌లో గొంతు కోసుకున్న యువకుడు..!

Tuesday, June 30th, 2020, 09:31:10 PM IST


తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. అదాలత్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ఓ వ్యక్తి చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు హుటాహుటిన అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆ వ్యక్తి వరంగల్ అర్బన్ జిల్లా అలంకాని పేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతడి బ్యాగులో ఓ సూసైడ్ నోట్ లభ్యమయ్యిది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే కారణమని, వచ్చే ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఆయన ఎమ్మెల్యేగా అన్‌ఫిట్ అంటూ సూసైడ్ నోట్‌లో రాశాడు. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.