24 గంటల్లో రికార్డులను ఏరి పారేసిన “అరవింద సమేత”.!

Thursday, October 4th, 2018, 08:06:33 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా,పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కున్న తాజా చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”.ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు అందరి కళ్ళు ఈ చిత్రం పైనే ఉన్నాయి.ఇప్పటికే ఏ పెద్ద చిత్రాలు రాక థియేటర్లు వెలవెలబోతున్నాయి.దీనితో ఒక్క పెద్ద సినిమా కావాలనుకున్న తరుణంలో యంగ్ టైగర్ ఈ దసరాకు థియేటర్ల మీద దాడి చెయ్యడానికి వస్తున్నాడు.ఇప్పటికే విడుదలయినటువంటి ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము లేపుతుంది.

మొన్న రాత్రి విడుదలైనటువంటి ట్రైలర్ 24 గంటల్లో బాహుబలి చిత్రం మినహా అన్ని సినిమాల యొక్క రికార్డులను తుడిచిపెట్టేసింది.ఒక పక్క వ్యూస్ రికార్డుల్లోనూ మరో పక్క లైక్స్ రికార్డుల్లోనూ ఏ ఒక్కటి వదలకుండా తారక్ వేటాడేసాడు.ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 8 మిలియన్(80 లక్షలు) మంది వీక్షించి కొత్త రికార్డును సృష్టించారు.అదే విధంగా అదే 24 గంటల్లో 3లక్షల 27వేల లైక్స్ తో మరో కొత్త రికార్డును సృష్టించింది.ఏది ఏమైనప్పటికి తారక్ ఇప్పటి నుంచే రికార్డులను వేటాడ్డం మొదలు పెట్టేసాడు.ఇక చిత్రం విడుదలయ్యాక ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.