“అరవింద సమేత” నుంచి మరో మాస్ మసాలా లుక్ రాబోతుంది..!

Wednesday, September 12th, 2018, 05:17:33 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో రాబోతున్న కొత్త చిత్రం “అరవింద సమేత వీర రాఘవ” ఇప్పటి వరకు కుటుంబ సమేతంగా చూడదగ్గ లేదా క్లాసీ ఎంటర్టైనెర్స్ తీసిన త్రివిక్రమ్ ఈ సారి మాత్రం మాస్ ప్రేక్షకుల ఆకలి తీర్చేలా ఉన్నాడు. రాయలసీమ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ ని చూస్తేనే ఆ సంగతి మనకి అర్ధం అవుతుంది.అసలే ఇప్పటికి అజ్ఞ్యాతవాసి చిత్రం పరాజయంతో త్రివిక్రమ్ డీలా పడ్డాడు ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థుల్లోని హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు..

అయితే ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికర వార్త ఒకటి ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయినా హారికా హాసిని వారు వారి ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచారు. ఈ రోజు సాయంత్రం 5:40 నిమిషాలకు “ఎదో రాబోతుంది” అని వారు తెలియజేసారు. ఈ చిత్రం లో అసలే యంగ్ టైగర్ చాలా కఠోర శిక్షణ తీస్కొని ఆరు పలకల దేహాన్ని సొంతం చేసుకున్నాడు. దానితో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ రోజు సాయంత్రం కూడా దానికి సంబందొంచిన ఒక మాస్ మసాలా పోస్టర్ ని విడుదల చేస్తారు అన్నట్టు సమాచారం. ఇప్పటికే టీజర్ తో ఒక రేంజ్ లో అంచనాలను పెంచేశారు. దసరా కానుకగా రాబోతున్న ఈ చిత్రం ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి..

  •  
  •  
  •  
  •  

Comments