ఆనందం కోసం శునకాన్ని హింసించిన యువకుల అరెస్ట్…?

Tuesday, May 26th, 2020, 07:25:48 AM IST

టిక్ టాక్ లో లైకుల కోసమని, ఒక శునకాన్ని హింసించినటువంటి కొందరు కిరాతకులు ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కాగా ముంబైకి చెందిన నిందితులను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరు యువకులు ఒక శునకం కాళ్ళను తాడుతో కట్టేసి, దాన్ని పట్టుకొని, ఒక మురికి గుంటలో విసిరేశారు. అంతేకాకుండా ఆ శునకం బయటకు రాకుండా దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో కొట్టారు కూడా. ఆ వీడియో వైరల్ అవడంతో పెద్ద దుమారమే చెలరేగింది. కాగా ఈ ఇద్దరు నిందితులను పట్టుకున్న వారికి “పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్’ (పెటా)” రూ.50 వేల నజరానా కూడా ఇస్తామని ప్రకటించింది.

ఎలాగైనా ఆ మూర్ఖులను పట్టుకొని శిక్షించాలని, పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. కాగా ఈ వీడియోను చూసిన ‘పెటా’ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, శునకాన్ని హింసించిన వారిని పట్టుకుని అప్పగిస్తే రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటించింది. దానికితోడు వారిని పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పోలీసులకు ఆ నిందితులు, చివరికి ఉజ్జయినిలో దొరికారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.