బిగ్ బ్రేకింగ్ : మరో ఏడాదిలో ముఖ్యమంత్రి కాబోతున్న వైఎస్ భారతి.!

Wednesday, January 15th, 2020, 03:22:33 PM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే పాలన ఎటు పోతుందో కానీ మొట్టమొదటి సరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వై ఎస్ జగన్ కన్న కలలన్ని ఒక్కసారిగా కుప్పకూలే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి అన్న సంకేతాలు వారే కొని తెచ్చుకున్నారని చెప్పాలి.దీనికి ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇతర పార్టీల కీలక నేతలు మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా రాజధాని మార్పునకు సంబంధించి మందడ లోని ఏర్పాటు చేసిన సభలో మాజీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాక రేపుతున్నాయి.

ఈ సభలో మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ సతీమణి వై ఎస్ భారతి ఇంకొక్క ఏడాదిలో ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆవిడ ఇప్పుడు ప్రభుత్వ పనులలో కూడా జోక్యం చేసుకోవడం మొదలు పెడుతున్నారని పైగా జగన్ మీద ఏపీ ప్రజలకు నమ్మకం పోతుందని అతను ఇంకెంతో కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడని అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక్క ఏడాదిలో వై ఎస్ భారతి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని సంచలనం రేపే కామెంట్స్ చేశారు.మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి ఏమన్నా సమాధానం వస్తుందో లేదో చూడాలి.