జ‌గ‌న్‌తో నిఖిల్ గౌడ భేటీ వెన‌కున్న ర‌హ‌స్యం!

Wednesday, June 12th, 2019, 06:09:08 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌డానికి ప‌క్క‌ రాష్ట్రానికి చెందిన కీల‌క నేత రావ‌డం చాలా అరుదు. అదీ గెలిచి అధికార పీఠం అధిష్టించిన అతి త‌క్కువ స‌మ‌యంలో అభినంద‌న‌లు చెప్ప‌డానికి రావ‌డం మ‌రీ అరుదు. కానీ అలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడు ఏపీ సీఎం విష‌యంలో జ‌ర‌గ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి హెచ్ డి కుమార‌స్వామి త‌న‌యుడు
నిఖ‌ల్ గౌడ ఇటీవ‌ల ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. బెంగ‌ళూరు నుంచి అమ‌రావ‌తి వ‌చ్చిన నిఖిల్ గౌడ వైఎస్ జ‌గ‌న్‌ని క‌లిసి కొంత సేపు మాట్లాడ‌టం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

సినిమాల్లో హీరోగా స‌క్సెస్ కానీ నిఖిల్ గౌడ ఇటీవ‌ల మాండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి స‌మ‌ల‌త చేతిలో ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. అయితే నిఖ‌ల్ గౌడ ప్ర‌త్యేకంగా జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం వెనక చాలా పెద్ద క‌థే వుండ‌నేది తాజా వాద‌న. వైఎస్ జ‌గ‌న్‌కు బెంగ‌ళూరులో ఆస్తులున్నాయి. భారీ వైశాత్యంతో నిర్మించుకున్న సౌధం లాంటి ఇల్లు కూడా వుంది. అత్య‌ధిక శాతం జ‌గ‌న్ అక్క‌డే కార్య‌క‌లాపాలు సాగించారు కూడా. గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడ‌న్న విష‌యం తెలిసిందే. అత‌న్ని త‌మ వైపు తిప్పుకోవాల‌న్న ఆలోచ‌న కార‌ణంగా నిఖిల్‌, జ‌గ‌న్‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిందా? అనేది అంతు చిక్క‌డం లేదు. రెడ్డి స‌మాజిక వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పుకోవాల‌న్న ఎత్తుగ‌డ‌లో భాగంగానే నిఖిల్ గౌడ ప‌నిగ‌ట్టుకుని మ‌రీ వ‌చ్చి జ‌గ‌న్‌ని ప్ర‌స‌న్నం చేసుకున్నారనే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. రెడ్డి వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పుకుంటే క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌కు ఎదురు వుండ‌ద‌ని త‌న ఆజ‌కీయ ఎదుగుద‌ల‌కు కూడా అది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిఖిల్ ఈ ప్లాన్ వేసిన‌ట్లు చెబుతున్నారు.