బాలయ్య ప్రత్యర్థికి జగన్ బంపర్ ఆఫర్ !

Tuesday, June 4th, 2019, 11:41:06 AM IST

గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీచినా బాలకృష్ణ ఇలాకా హిందూపురంలో మాత్రం పచ్చ జెండా రెపరెపలాడింది. గత ఎన్నికల్లో కంటే కొంచెం ఎక్కువ మెజారిటీతోనే బాలయ్య గెలుపొందారు. కానీ హిందూపురం ఎంపీ స్థానం మాత్రం వైకాపా ఖాతాలోకే వెళ్లింది. దీంతో ఎలాగైనా హిందూపురం మీద పట్టు పెంచుకోవాలని నిర్ణయించుకున్న జగన్ ఆ నియోజకవర్గంలో వైకాపా నేతల ప్రాభవం గట్టిగా ఉండేలా పావులు కదుపుతున్నారు.

అందులో భాగంగానే బాలక్రిష్ణ చేతిలో ఒటమిపాలైన మాజీ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గతంలో విజయవాడ పార్లమెంటరీ సమన్వయకర్తగా వ్యవహరించిన మహమ్మద్ ఇక్బాల్ తనది కర్నూల్ జిల్లా కాబట్టి అక్కడి నుండే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ జగన్ మాత్రం హిందూపురం నుండి పోటీ చేయించారు. ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ అప్పుడే మాటిచ్చారట.

ఆ మాట ప్రకారం ఇప్పుడు ప్రకటన చేశారట. మరి మెజారిటీ భాగం వైకాపా నేతల ప్రాభవం ఉండనున్న హిందూపురంలో బాలయ్య తన పట్టును నిలబెట్టుకోవాలి అంటే గతం కంటే ఈసారి ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది.