కరోనా విషయంలో జగన్ ప్రభుత్వం మరో అద్భుతమైన నిర్ణయం..!

Saturday, July 11th, 2020, 01:59:00 PM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కరోనా విషయం లో తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతం అని చెప్పాలి. కరోనా ఎంటర్ అయిన మొదట్లో చర్యలు, ప్రెస్ మీట్లు చూసి అంతా హేళన చేసినప్పటికీ జగన్ పవర్ చేతిలో ఉంటే ఎలాంటి అద్భుతాలు చెయ్యొచ్చో అంతే అద్భుతాలు సీఎం గా జగన్ చేస్తున్నారచని చెప్పాలి.

ఇప్పటికే కరోనా పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకొని అద్భుతం అనిపించారు. కరోనా నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించి వాటి నిర్వాహణ కోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయలు కేటాయించిందని..

ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, సౌకర్యాలకు వాడతారు, వాటి కేంద్రాలను జేసీ లు పర్యవేక్షిస్తారు అని
కోవిడ్ నియంత్రణ నోడల్’ అధికారి కృష్ణ బాబు తెలిపినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. అంతే కాకుండా క్వారంటైన్ సెంటర్స్ లో పడకల సంఖ్య 5 వేలకు పెంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

అలాగే బాధితుల ఆహరం కోసం మనిషికి రోజుకు రూ. 500/ కేటాయిస్తున్నట్లు తెలిపారు, అలాగే పనితీరు సరిగాలేని కేంద్రాల బాధ్యులకు క్రమశిక్షణ చర్యలు తప్పవని వెల్లడించారు.. ఈ విధంగా జగన్ దూసుకుపోతున్నారని చెప్పాలి.