జగన్ మాటలు విని అభిమానులే మోసపోయాం అని చెప్తున్నారు..చూసారా?

Saturday, December 14th, 2019, 07:01:38 AM IST

దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అని రాజన్న బిడ్డ మాట ఇస్తే మాట తప్పడని మాట తిప్పం మడమ తిప్పను అని జగనే డప్పు కొట్టుకుంటే దానికి కొంతమంది వీరాభిమానులు వంత పాడుతుంటారు.నిజానికి చెప్పాలంటే అలాంటి అభిమానులే జగన్ కు ఎక్కువ ఉన్నారు.అతను ఏ పని చేసిన ముందొక మాట చెప్పి తర్వాత ఒక మాట చెప్తే వాటినే గుడ్డిగా ఫాలో అయ్యిపోతారు తప్ప తమని మాటలతో ఎందుకు మభ్యపెడుతున్నాడా అని కనీసం ఆలోచించరు.

కానీ ఇప్పుడిప్పుడే జగన్ అంటే ఏమిటో గతంలో ఆయన చెప్పిన మాటలను ఎంతో గర్వంగా షేర్ చేసుకొని ఇప్పుడు జగనే మాట తప్పడంతో తాము మొహం ఎక్కడ పెట్టుకోవాలా అని బాధ పడుతున్నారు.తాజాగా జగన్ అసెంబ్లీ సాక్షిగా మేము సన్న బియ్యం ఇస్తామని అనలేదు స్వర్ణ బియ్యం ఇస్తాము అని చెప్పిన మాట నిజం రికార్డు కూడా ఉంది అదే విధంగా ఎన్నికలకు ముందు తన సభలలో కానీ పాదయాత్రలో కానీ నమ్మిన ప్రజలకు దుడ్డు బియ్యం ఎవరు తింటారు సన్న బియ్యం నేను అధికారంలోకి వచ్చాక ఇస్తానని చెప్పిన మాట కూడా ఆఫ్ ది రికార్డు ఉంది.

ఇంత కన్నా ఇంకేం కావాలి జగన్ విజ్ఞత అతని మాటల గారడీని చూపించడానికి.దీనితో జగన్ అభిమానులే జగన్ మాటలు విని మోసపోయాం అని చెప్తున్నారని ఇకనైనా మిగతా వాళ్ళు కళ్ళు తెరవండి అంటూ వారు పెట్టిన పోస్టులను తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఇకనైనా మిగతా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారో లేక ఎప్పటిలానే జగన్ ఏం చేసినా గ్రేటు అని జేజేలు పలుకుతారో నిశ్చయించుకోవాలి.