విజయసాయిరెడ్డిపై మరో బాధ్యత పెట్టిన జగన్

Thursday, June 13th, 2019, 06:42:49 PM IST

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించడం వెనుక జగన్ కృష్టితో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కష్టం కూడా ఉంది. విజయసాయిరెడ్డిని పూర్తిగా నమ్మిన జగన్ అన్ని విషయాల్లోనూ ఆయన విలువైన సలహాలను, సూచలను పాటిస్తూ ముందుకువెళ్లారు. విజయసాయిరెడ్డి సైతం అధ్యక్షుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతి దశలోనూ నిలబెట్టుకున్నారు. ఫోకస్ చేసిన అన్ని విషయాల్లోనూ సత్పలితాలను రాబట్టారు. అందుకే జగన్ ఇంకో పెద్ద బాధ్యతను కూడా ఆయనపై పెట్టారు.

అవే లోకల్ ఎలక్షన్స్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకపక్ష ఫలితాల్ని రాబట్టుకోవాలని డిసైడ్ అయిన జగన్ విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపారు. అధ్యక్షుడి ఆదేశాలను అందుకున్న విజయసాయిరెడ్డి ఇవాళ నియోజకవర్గ, మండలి స్థాయి నేతలతో అమరావతిలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశాలపై విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.