ఏపీ హెల్త్ కేర్ కు మరింత బూస్టప్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..!

Monday, July 13th, 2020, 09:37:02 AM IST

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర కరోనా విషయంలో నిరంతరం కృషి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వైద్య శాఖకు మరింత చేదోడు ఇచ్చే విధంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది.

అందులో భాగంగా 16 కొత్త మెడికల్ కాలేజ్ లు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక కాన్సర్ హాస్పిటల్, ఒక మానసిక వైద్య ఆసుపత్రి మరియు 11 వేల 197 గ్రామాల్లో క్లినిక్ సెంటర్స్ ఏర్పాటు చేయడమే కాకుండా..

ఇప్పటికే ఉన్న హాస్పిటల్స్ నుంచి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని మార్చడం జరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. దీనితో జగన్ విజన్ ఉన్న నాయకుడు అని మరోసారి నిరూపించుకున్నారని ఆయన కితాబిచ్చారు.