జ‌గ‌న్‌కి కోర్టుకేసులు తెచ్చిన ముప్పు?

Tuesday, September 26th, 2017, 01:50:32 AM IST

వైయ‌స్ జ‌గ‌న్ కి కోర్టు కేసులు త‌లనొప్పిగా మారాయా? వైకాపా పార్టీ కార్య‌క‌లాపాల‌కు ఆటంకాలుగా మారాయా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవ్వాల్సిన వైఎస్ జగన్ పాదయాత్ర నవంబర్ మొదటి వారానికి వాయిదా పడింది. అంతేకాదు.. పాదయాత్ర స‌హా విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌య ప్రారంభోత్స‌వాన్ని వాయిదా వేశార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే పార్టీ కార్యాల‌య ప్రారంభోత్స‌వానికి పార్టీ నేత‌లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగానే ఈ ఇబ్బంది ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. కోర్టుకేసులు పంటికింద రాయిలా త‌గిలి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. దాంతో కార్య‌క‌లాపాలు వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికి వాయిదా ప‌డినా, అక్టోబర్ మొదటి వారం నుంచి జిల్లాల వారీగా జగన్ పర్యటిస్తారని, ఈ పర్యటనలో పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్టీ కార్య‌క‌లాపాలు, కోర్టు కేసులు రెండిటినీ జ‌గ‌న్ బ్యాలెన్స్ చేయాల్సిన స‌న్నివేశం ఉందని .. ఇది జ‌గ‌న్ కి కాంప్లికేటెడ్ సిట్యుయేష‌న్ అంటూ ప్ర‌చారం సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments