చంద్ర‌బాబుకు జ‌గ‌న్ మార్క్ పంచ్‌!

Monday, June 10th, 2019, 05:35:55 PM IST

ముందే ఊహించిన‌దే జ‌రుగుతోంది!.. చంద్ర బాబుకు భ‌జంత్రీ మొద‌లైంది. ఈ భ‌జంత్రీ పీక్స్ కి చేర‌బోతోంది. ఇది వైయ‌స్ బ్రాండ్ భ‌జన భ‌జన‌.. శ‌త్రువు భ‌ర‌తం ప‌ట్టే భ‌జ‌న.. చెక్ డీటెయిల్స్..

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు నూత‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భారీ పంచ్ ఇచ్చారు. అలిపిరి ఘ‌ట‌న త‌రువాత నుంచి చంద్ర‌బాబుకు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌, బ్లాక్ కంమెండోల ప‌హారా గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే చంద్ర‌బాబు భ‌ద్రతా సిబ్బందిలో కొంత మందిని వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ తొల‌గించింది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాదు కాబ‌ట్టి ఆయ‌న కాన్వాయ్ క‌ద‌ల‌డానికి ముందు క‌దిలే సెక్యూరిటీ క‌వ‌ర్‌ను తాజాగా తొల‌గించి జ‌గ‌న్ మార్కు పంచ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాన్వాయ్ క‌ద‌లిక‌ను అనుస‌రించే సెక్యూరిటీ సిబ్బందిని తొల‌గించినా చంద్ర‌బాబుకు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త అలాగే కొన‌సాగుతుంద‌ని, అడ్వాన్స్‌గా వున్న పైల‌ట్ సిబ్బందిని మాత్ర‌మే తొల‌గించార‌ని తెలుస్తోంది. బాబుకు తొల‌గించిన పైలెట్ సెక్యూరిటీ సిబ్బందిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు కేటాయించిన‌ట్లు చెబుతున్నారు. భ‌ద్ర‌తా మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగానే చంద్ర‌బాబు సెక్యూరిటీ సిబ్బందిలో మార్పులు చేశామ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది. మ‌రి దీనిపై టీడీపీ త‌మ్ముళ్లు ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.