అపోహ‌ల‌కు చెక్ పెట్టి జ‌గ‌న్ మార్క్ గేమ్?!

Saturday, June 8th, 2019, 10:37:29 AM IST

వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే ఆంధ్రా అభివృద్ధి ఆగిపోతుంది. అదీ కాకుండా వేల కోట్లు దోచుకుంటాడు. ఏపీ అంతా అంధ‌కార‌మ‌వుతుంది. అత‌న్ని సీఎంని చేస్తే మ‌న ఏపీకి చ‌ర‌మ‌గీతం పాడిన‌ట్టే. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ‌గా మార‌డతాడు. తెలంగాణకు సామంత‌రాజు అవుతాడు. ఇలాంటి స‌మంత రాజు, కోట్లు కొల్ల‌గొట్టి జైలుకు వెళ్లిన వ్య‌క్తి మ‌న‌కు అవ‌స‌ర‌మా?. జ‌గ‌న్ మార‌డు ప‌ద‌విలోకి వ‌స్తే దొంగ‌కే తాళం ఇచ్చిన‌ట్ల‌వుతుంది. ఇవి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మ్మోహ‌న్‌రెడ్డి పై ఎన్నిక‌ల స‌మయంలో వినిపించిన సందేహాలు.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత కూడా చాలా మంది టీడీపీ అనుకూల వ‌ర్గం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇలాంటి ప్ర‌చారాల‌నే చేసింది. ఇంకా చేస్తోంది.

వీట‌న్నింటికీ త‌న మంత్రి వ‌ర్గ కూర్పుతో చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు వైఎస్ జ‌గ‌న్‌. ముఖ్య‌మంత్రిగా ప‌దవీ ప్ర‌మాణం చేసిన ద‌గ్గ‌రి నుంచి వివిధ శాఖ‌ల‌పై వ‌రుస స‌మీక్షలు నిర్వ‌హించిన ఆయ‌న ప‌లు కీల‌క విష‌యాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌న మంత్రి వ‌ర్గాన్ని కూర్చిన‌ట్లు తెలుస్తోంది. సామాజిక వ‌ర్గాల వారిగా స‌మ‌తూకాన్ని పాటిస్తూ అర్హుల‌ని అంద‌లం ఎక్కించాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు క‌నిపిస్తోంది. మంత్రి వ‌ర్గ కూర్పుపై స‌ర్వ‌త్రా హ‌ర్హం వ్య‌క్తం కావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. రోజాకు మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌పోయినా జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నాన్ని హ‌ర్షిస్తుండ‌టం ఆలోచ‌న రేకితిస్తోంది. మంత్రి వ‌ర్గ కూర్పుతోనే త‌న విజ‌న్ ఏంటి? ఎలాంటి పాల‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు అన్న‌ది చిన్న జ‌గ‌న్ చిన్న ట్రైల‌ర్ వ‌దిలార‌ని. పూర్తి పిక్చ‌ర్ పోల‌వ‌రం టెండ‌ర్‌ల రీ టెండ‌రింగ్ ప్ర‌క్రియ మొద‌లైతే కానీ తెలియ‌ద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. పాద‌యాత్ర అనంత‌రం పూర్తిగా మారిపోయిన జ‌గ‌న్ త‌న‌పై చేస్తున్న విష ప్ర‌చారాన్ని విమ‌ర్శ‌లతో కాకుండా విన‌యంగా చేత‌ల‌తో తిప్పికొట్టాల‌నుకుంటున్నార‌ట‌. దానికి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.