ఏపీ కేబినెట్‌కి షాకిస్తున్న `8` సెంటిమెంట్?

Monday, June 10th, 2019, 08:22:04 PM IST

ఎనిమిదికి వైయ‌స్ జ‌గ‌న్ కి ఏదైనా సంబంధం ఉందా? వ‌స్తూనే `8` అంకెనే క‌ల‌వ‌రిస్తున్నాడు. ఆయ‌న ల‌క్కీ నంబ‌ర్ 8. అందుకేనా ఈ క‌ల‌వ‌రం? ఏమో .. దీనికి జ‌గ‌న్ అభిమానులు స‌మాధానం చెబుతారేమో!! ఇప్ప‌టికైతే ఎనిమిది ఫైళ్ల‌పై ఆయ‌న సంత‌కం ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

నేడు వైయ‌స్ జ‌గ‌న్ కేబినెట్ కొలువుదీరింది. ఇప్ప‌టికే ఏపీ కేబినెట్ తొలి భేటీ జరుగుతోంది. నేటి ఉదయం 10.30కి ఈ సమావేశం మొద‌లైంది. తొలి సమావేశంలో 8 కీలక నిర్ణయాలపై కేబినెట్‌ చర్చిస్తోంద‌ని స‌మాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై విస్త్ర‌తంగా చర్చ సాగుతోంది. అలానే పీడిత బాధితులైన‌ పెన్షన్లు, ఆశా కార్యకర్తల వేతనాల పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలపనుందని తాజా స‌మాచారం. మునిసిపల్‌ కార్మికుల జీతాల పెంపు… అక్టోబర్‌ నుంచి రైతు భరోసా అమలు, హోంగార్డుల జీతాల పెంపు.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌, సీపీఎస్‌ రద్దుపై చర్చ సాగుతోంద‌ని తెలుస్తోంది. మొత్తానికి ఆ ఎనిమిది ఫైళ్లు కొన్ని ల‌క్ష‌ల మంది జీవితాల్ని అమాంతం మార్చ‌బోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది.