డాలస్ లో కూడా అదరగొట్టిన జగన్..!

Sunday, August 18th, 2019, 10:53:02 AM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తన అమెరికా పర్యటనలోని భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులతో ముచ్చటించేందుకు డాలస్ లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే.జగన్ అక్కడకి వస్తున్నారని ముందు గానే వైసీపీ అధిష్ఠానం కూడా తెలియజేసారు.ఇదిలా ఉండగా జగన్ అక్కడకు వస్తుండంతో అక్కడి వైసీపీ అభిమానులు కూడా ఊహించని రేంజ్ లో ఏర్పాట్లు చేసారు.ఇక్కడ జగన్ కు అభిమానులు ఏ రేంజ్ లో స్వాగతం పలుకుతారో అదే రేంజ్ లో జగన్ కు అమెరికాలో కూడా అభిమానులు ఘనమైన స్వాగతం పలికారు.

ఆగష్టు 17 మధ్యాహ్నం జగన్ తన స్పీచ్ తో ఆ సభకు తరలి వచ్చిన వేలాది మంది అభిమానులను ఉర్రూతలూగించారు.స్పీచ్ ఇస్తూ ఇక్కడలానే అక్కలకు,అన్నలకు,అవ్వా తాతలకు అందరికి తన నమస్కారాలు అంటూ..వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే మాట చెప్పే సరికి ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది.అలా జగన తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.తాను మొత్తం 175 నియోజకవర్గాలో ఏకంగా 151 స్థానాలు గెలుపొందడానికి కారణం ఇక్కడున్న తెలుగు వారు కూడా అని తన గెలుపు కోసం వారు కూడా ఎంతగానో కష్టపడ్డారని వారందరికీ ధన్యవాదాలు తెలిపి తన ప్రసంగాన్ని కొనసాగించారు.