విశ్లేషణ : జగన్ మైండ్ గేమ్ మాములుగా ఆడట్లేదుగా..ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.!

Tuesday, October 15th, 2019, 07:10:39 PM IST

ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ను మాట తప్పని నేత మడమ తిప్పని నేత అని అతని అభిమానులు ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తుంటారు.అయితే అది ఎంత వరకు నిజమో కానీ ఇప్పుడు వై ఎస్ జగన్ ప్లే చేస్తున్న మైండ్ కోసం కొంచెం ఆలోచించినట్టైతే ఒక్కక్కరికి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని చెప్పాలి.రాజకీయ నాయకులు ముందు చెప్పింది చెయ్యకుండా దానినే చిన్న చిన్న మార్పులు చేసి అదే ఒక పెద్ద అద్భుతంలా చూపించి ప్రజలను మభ్యపెట్టడం అనేక సినిమాల్లో చూసి ఉంటాం.

ఇప్పుడు ఇలాంటి మైండ్ గేమ్ నే జగన్ ప్లే చేస్తున్నట్టు చెప్పాలి.దీనికి సరైన విశ్లేషణ కూడా ఉంది.జగన్ ఇచ్చిన హామీల్లోనే రెండు ఉదాహరణలను మనం పరిగణించవచ్చు.ఎన్నికలకు ముందు జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నవరత్నాల్లో ఇప్పుడు చాలా లొసుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ వారు చివర్లో పింఛనును 2000వేలకు పెంచితే జగన్ దాన్ని 3000 వేలకు పెంచుతున్నానని చెప్పిన మాట నూటికి నూరు పాళ్ళు వాస్తవం.

ఇదే ముక్క చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసారు.అంతే కాకుండా అంతకు ముందే 45 ఏళ్లకే పింఛను తాను అధికారంలోకి వచ్చాక అందిస్తానని అన్నారు.తీరా అధికారంలోకి వచ్చాక ఈ 45 ఏళ్ల పింఛను ఏమో కానీ ఇస్తానన్న 3000 పింఛను కాస్తా అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతామని తమ మ్యానిఫెస్టోలో రాసామని అది చూపిస్తున్నారు.వాళ్ళు రాసుకుంటే సరిపోతుందా?ఏ మాట ప్రకారం 3000 వేలు ఇస్తానని జగన్ చెప్పిన మాటలను వినే తాము ఓటేసామని 2250 పించను తీసుకున్న వృద్ధులు జగన్ ను తిట్టి పోశారు.

ఇవన్నీ వైసీపీ క్యాడర్ కు తెలిసినా సరే వాళ్లకు ఏమీ కనపడనట్టు వ్యవహరించారు.ఇదే పెద్ద షాక్ అనుకుంటే జగన్ అసలైన మైండ్ గేమ్ ఇప్పుడు కనబడుతుంది చూడండి.వైసీపీ నవరత్నాల్లో “వైఎస్సార్ రైతు భరోసా” పథకం కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది.తాను అధికారంలోకి వస్తే ఏపీలో ఈ పథకానికి అర్హులైన రైతులు అందరికి సంవత్సరానికి 12,500 రూపాయలను అందజేస్తానని మాట ఇచ్చారు.

అయితే ఇప్పుడు కూడా 12,500 ఇస్తానని అంటున్నారు కాకపోతే అది కేంద్రం ఇచ్చే 6000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 6500 ఇలా మొత్తం కలిపి 12,500 ఇస్తున్నామని సింపుల్ గా చెప్పేసారు.ఈ వార్త విన్నవారికి మాత్రం నిజంగానే మైండ్ బ్లాక్ అయ్యింది.ముందు జగన్ చెప్పిన మాటల ప్రకారం ఎవరన్నా సరే పన్నెండు వేలు ఇస్తారనే అనుకుంటారు కానీ ఇలా మమ్మల్ని మభ్యపెడుతున్నారని అనుకోరు ఈ పాయింట్ ను జగన్ పట్టుకొని నిజంగా అసలైన పొలిటిసియన్ అనిపించుకున్నారని చెప్పాలి.

అయినా జనానికి కూడా ఇలాంటివే కావాలి లెండి.ఇలాంటి విషయాలు ఏవి ముందు చెప్పకుండా ఇప్పుడు చిన్నచిన్నగా చెప్తూ ఎక్కడా కూడా ప్రజల నుంచి వ్యతిరేఖత రాకూడదని జగన్ మరో అద్భుత ప్లానింగ్ వేసి ప్రజల మైండ్ సెట్ ను మలుపు తిప్పే ప్రయత్నం చేసారు.అదేంటంటే ఇప్పుడు ఇదే వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద మొత్తం 12,500 కాదు ఇంకో వెయ్యి పెంచి మొత్తం 13,500 ఇస్తున్నామని చెప్తున్నారు.

ఇక్కడే జగన్ అసలు సిసలైన ప్లానింగ్ దాగి ఉంది.మాములుగా సామాన్య జనంలో ఆలోచనా భావం తక్కువ దానినే జగన్ టార్గెట్ చేసారు.నిజానికి రైతులకు జగన్ ఇప్పుడు పెంచిన వెయ్యితో కలిపి ఇవ్వబోతుంది కేవలం 7500 మాత్రమే మిగతా 6000 వేలు కేంద్రం ఇస్తుంది.అంటే ముందు జగన్ ఇచ్చిన మాట ప్రకారం మొత్తం రైతుకు అక్షరాలా 19,500 రావాలి కానీ 13,500 మాత్రమే వస్తుంది.అటు కేంద్రం క్రెడిట్ కూడా జగన్ ఖాతాలో వేసేసుకొని తామే మొత్తం 12,500కు అదనంగా 13,500 ఇస్తున్నట్టుగా స్క్రిప్ట్ రాసుకున్నారు.

ఇప్పుడు ఈ 1000 రూపాయలు పెంచేసారన్న ఆనందంలో జనం కూడా తాము కోల్పోతున్న మిగతా డబ్బును తమ హక్కును మర్చిపోయేలా జగన్ కేవలం 1000 రూపాయలు పెంచామన్న మాటతో అదిరిపోయే మైండ్ గేమ్ ఆడారు.ఇక ముందు నుంచి కూడా ప్రజలకు మిగతా పథకాల్లో ఇలాగే చేస్తారు.”జనానికి ఏమాత్రం అనుమానం రాకుండా ఎన్నా స్క్రిప్ట్ రాసావ్ తలైవా”ఇలాంటివన్నీ ప్రజలు ఇప్పుడే గమనించకపోతే ఇక ముందు తరాలు కూడా ఇలాగే మోసపోతుంటారు అని చెప్పాలి.