జగన్ క్యారెక్టర్ కోసం సూర్య సెలెక్ట్ చేసిన హీరో ఎవరంటే?

Wednesday, July 25th, 2018, 07:56:55 PM IST

వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా స్పీడ్ గా ముందుకు సాగుతోంది. పాత్రల కోసం దర్శకుడు మహి రాఘవ ఇప్పటికే అందరిని సెలెక్ట్ చేయగా వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర కోసం ఇంకా ఎవరిని అధికారికంగా ఫైనల్ చేయలేదు. వైఎస్ పాత్రలో మమ్ముంటి కనిపిస్తున్నారు. అయితే ఆ పాత్రకు ధీటుగా ఉండాలని స్టార్ డమ్ ఉన్న హీరో కోసం ఇన్నాళ్లు వెతికారు. అయితే ఫైనల్ గా సూర్యని ఇటీవల సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ సూర్య ప్రస్తుతం నిర్మాతగాను అలాగే దర్శకుడిగాను బిజీగా ఉన్నాడు. దీంతో సూర్యనే స్వయంగా కార్తీని ఆ పాత్రకు ఫిక్స్ చేయమని చిత్ర యూనిట్ కి తెలిపినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ న్యూస్ వెలువడనున్నట్లు ఫిల్మ్ నగర్ లో గట్టి టాక్ వినిపిస్తోంది. మరి కార్తీ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments