తన పై జరిగిన హత్యా యత్నంపై బాబుకి జగన్ దిమ్మతిరిగే కౌంటర్లు.!

Sunday, November 18th, 2018, 12:32:09 AM IST

వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర పునః ప్రారంభంతోనే చంద్రబాబు మీద తన ఆగ్రహ జ్వాలలను కురిపిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లోని సంచలనంగా మారిన ఘటన ఏదైనా ఉంది అంటే అది జగన్ పై జరిగిన హత్యా ప్రయత్నం.అయితే ఇప్పటి వరకు ఆ ఘటన పై వైసీపీ నేతలకు మరియు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నడిచింది.కానీ మొట్ట మొదటి సారిగా వై ఎస్ జగన్ ఈ రోజు తన మీద జరిగిన హత్యా ప్రయత్నం పై ఈ రోజు నోరు విప్పారు. ఈ రోజు సాయంత్రం పార్వతీపురంలో జరిగినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.

నాపై జరిగిన దాడి ముమ్మాటికీ చంద్రబాబు చేయించిందే అని దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.ఆ దాడి చేసిన యువకుడు పని చేస్తున్న రెస్టారెంట్ యజమాని టీడీపీకి చెందిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు.అంత భద్రత ఉండే ప్రదేశంలోకి ఆ యువకుడి దగ్గరకి ఆ కత్తి ఎలా వచ్చింది అని,అంతే కాకుండా దాడి జరిగిన గంటలోపే చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం మొదలు పెట్టేశారని,ఇన్ని అనుమానాలు వస్తున్నప్పుడు నా మీద కుట్ర జరగలేదా అని మండిపడ్డారు.

అంతే కాకుండా జగన్ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నా మీద దాడి జరిగిన అతి కొద్ది సమయంలోనే ఆ యువకుడు నా అభిమాని అని చెప్పి ఫ్లెక్సీలు విడుదల చేస్తారని కానీ అందులో తన తండ్రి ఫోటో గాని,తన తల్లి ఫోటో గాని ఉండవని కానీ మధ్యలో గరుడ పక్షి మాత్రం ఎందుకు ఉందని,ఇదంతా తనని మట్టుబెట్టడానికి చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రే అని జగన్ సంచలనానికి తెర లేపారు.