కొత్త సీఎం మొద‌టి మూడు సంత‌కాలు ఇవిగో..

Saturday, June 8th, 2019, 01:13:32 PM IST

వైకాపా అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక త‌న‌దైన మార్క్ చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టి 25 మంది మంత్రుల్ని ప్ర‌క‌టించారు. నేడు వీళ్లంతా ప్ర‌మాణ స్వీకారాలు చేస్తున్నారు. కొత్త సీఎం సంత‌కాలు చేసే తొలి మూడు ఫైళ్లు ఏవి అంటే.. ఇదిగో వివ‌రాలు..ఇలా ఉన్నాయి.

జ‌గ‌న్ సీఎం అయ్యి తొలిగా.. `ఆశ` వర్కర్ల జీతాల పెంపు పై సీఎం మొద‌టి సంతకం చేస్తున్నారు. అలాగే అనంత ఎక్స్ప్రెస్ హైవే కి కేంద్ర అనుమతి కోరుతూ రెండవ సంతకం చేస్తున్నారు. జర్నలిస్ట్ ఇన్సూరెన్స్ పరిమితి రూ.10 లక్షల వ‌ర‌కూ పెంచుతూ ఫైల్ పై మూడవ సంతకం చేశారు. ఈ మూడూ చాలా ఇంపార్టెంట్.

ఇక ఏపీలో వైఎస్‌.జగన్ మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దక్కుతుందని ఆశించిన వారిలో కొందరికి షాకులు తప్పలేదు. వీరిలో కొందరు సీనియర్లు ఉంటే.. మరికొందరు జూనియర్లు కూడా ఉన్నారు. జగన్ కోసం ముందు నుంచి కష్టపడిన వారిలో కూడా కొందరికి మంత్రి పదవులు రాలేదు. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణల సమతుల్యత నేపథ్యంలో కొందరికి మంత్రి పదవులు రాకపోయినా… వారికి వచ్చే రెండున్నరేళ్ల తర్వాత అవకాశం కల్పిస్తామని కూడా జగన్ హామీ ఇవ్వ‌డంతో కొంత ఊర‌ట క‌నిపిస్తోంది.