భారత్ లోని బెస్ట్ సీఎం గా మరోసారి వై ఎస్ జగన్.!

Saturday, August 8th, 2020, 10:43:26 AM IST

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కరోనా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఈ మధ్య కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అతన్ని బాగా హైలైట్ చేసాయి. కరోనా ఎంటర్ అయిన మొదట్లో అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వాటికి ఎదురెళ్లి అదే విమర్శలు కురిపించిన వారితో అభినందనలు రాబట్టుకున్నారు. అయితే ఆ సమయంలో మన దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ ఆరవ స్థానంలో నిలిచినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా వారు చేసిన సర్వేలో తేలింది.

కరోనా సమయంలో సమర్ధవంతమైన చర్యలు తీసుకున్న ఉన్నత ముఖ్యమంత్రిగా అప్పుడు సత్తా చాటిన వై ఎస్ జగన్ ఈసారి మళ్ళీ టాప్ స్థానంలో నిలిచినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఇండియా టుడే లో వై ఎస్ జగన్ టాప్ పెర్ఫామింగ్ ముఖ్యమంత్రుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచారని నిర్ధారించారని మన ప్రియతమ నాయకుడు ప్రజల ప్రేమతో పొందిన మరో విజయమే ఇది అని విజయసాయి రెడ్డి తెలిపారు.